రమణదీక్షితులు మళ్లీ మొదలుపెడతాడా ? ఏం చేయబోతున్నాడు

తెలుదేశం పార్టీ అధికారంలో ఉండగా చికాకు పెట్టించిన అంశం ఆ పార్టీకి ఏమైనా ఉందా అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా పనిచేసిన రమణదీక్షితుల వ్యవహారమే .

టీటీడీ నగల వ్యవహారమే కాకుండా అనేక అంశాలను ఎత్తి చూపి ప్రభుత్వ ప్రతిష్టను ఆయన మంటగలిపారని అప్పట్లో టీడీపీ నాయకులు అనేకమంది ఆయన మీద విమర్శలు చేశారు.

బలవంతపు పదవీ విరమణతో గత ప్రభుత్వంపై రమణదీక్షితులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆయన మళ్లీ ఆలయ వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారని టాక్ నడుస్తోంది.

అలాగే టీటీడీ పాలక మండలితో పాటు దేవస్థానం ఈవో, జేఈవో, ఇతర అధికారులను కొత్త ప్రభుత్వం కొలువుతీరగానే మార్చేస్తారని ప్రచారం జరుగుతోంది.ఒకప్పటి తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి కూడా తిరిగొస్తారని చెప్పుకుంటున్నారు.65ఏళ్ల వయసు దాటిందంటూ పదవీ విరమణ చేయించిన టీటీడీపై రమణదీక్షితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.మీడియా సమావేశాల్లో టీటీడీపై విమర్శలకు దిగిన ఆయనకు బీజేపీ, వైసీపీ నాయకులు మద్దతు ప్రకటించారు.

అలాగే వైసీపీ ఎన్నికల హామీ మేరకు అర్చకులకు పదవీ విరమణ అనేది లేకుండా చేస్తాను అని జగన్ ప్రకటించారు.అయితే అర్చకుల వయస్సుకు సంబందించిన విషయం కోర్టు లో పెండింగ్ లో ఉంది.

Advertisement

ఇప్పుడు రమణ దీక్షుతులు టీటీడీలో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అనేదానికి బలం చేకూర్చేలా ఈ నెల 16 వ తేదీన ఆయన జగన్ ను కలవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.ఆయన టీటీడీలో అడుగుపెట్టగానే గత టీడీపీ ప్రభుత్వం ఏమేమి అవకతవకలు చేసిందని ఆరోపణలు గుప్పించారో అవే ఆరోపణలను నిరూపించేలా ప్రయత్నిస్తారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనైనా మరికొద్ది రోజుల్లో టీటీడీలో అనేక మార్పు చేర్పులు చోటు చేసుకోవడం తప్పదన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు