మళ్ళీ మహర్షి కాంబినేషన్ రిపీట్! వచ్చే ఏడాది సెట్స్ పైకి

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ హీరోగా మహర్షి మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలెక్షన్ తో దూసుకుపోతుంది.మహేష్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ చిత్రంగా మారబోతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు వందల కోట్ల కలెక్షన్ మార్క్ ని దాటేసింది అనే టాక్ వినిపిస్తుంది.

 Maharshi Combination Repeat On 2020-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వేసేసాడు.ఇక టూర్ నుంచి వచ్చిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తాడనే టాక్ వినిపించింది.అది కాకుంటే త్రివిక్రమ్, లేదంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అందరూ భావించారు.

అయితే ఊహించని విధంగా మహేష్ బాబు మళ్ళీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్తుందని అయితే దానిని వచ్చే ఏడాది వేసవి వరకు సమయం పడుతుందని తెలుస్తుంది.

దేనితో మహేష్ తో సినిమా అనుకున్న పరశురాం ఇప్పుడు మరో హీరోని వెతుక్కోవడానికి రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube