జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయితే.. ఆయన జీతం ఎంత తీసుకుంటాడో తెలుసా?

వచ్చే ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయని ఊహాగానాలు విపరీతంగా వినిపిస్తున్నాయి.

దీనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవ్వడం ఖాయం అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం తో ఉన్నారు.

ఇప్పటికే చాలా సర్వేలు కూడా జగన్ పార్టీయే గెలిచి తీరుతుందని తేల్చేశాయి.అందుకే కొందరు నేతలు అప్పుడే పదవులపై జగన్ వద్దకు రాయబారాలు కూడా చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పుడంతా జగన్ ఏపీ కి ముఖ్యమంత్రి అయితే ఆయన జీతం ఎంత తీసుకుంటాడో అన్న విషయం పైనే అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఒకవేళ అన్ని అనుకూలించి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ఒక్క రూపాయి జీతాన్ని మాత్రమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం పైన అయన తన సన్నిహితులతో పాటు కొంత మంది పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం.

Advertisement

ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రెండున్నర లక్షల జీతం తీసుకుంటూ దేశం లో అధిక వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితా లో 3 వ స్థానం లో ఉన్నాడు.అధిక వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితా లో మొదటి రెండు స్థానాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ లు ఉన్నారు.ఇకపోతే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత ఒక్కరూపాయి తీసుకుంటుండగా, పశ్చిమ బెంగాల్ దీదీ అసలు అది కూడా పుచ్చుకోవట్లేదు.

Advertisement

తాజా వార్తలు