అమ్మవారి ఆలయంలో అపశృతి....ఆందోళన చెందుతున్న భక్తులు

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది.నవ వజ్రాల తో పొదిగిన అమ్మవారి కిరీటంలో ఒక వజ్రం కనిపించకుండా పోయింది.

 Diamond Missing From Basara Saraswathi Ammavari Crown-TeluguStop.com

దీనితో భక్తులుచేస్తున్నారు.పూజారులు అధికారులు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోయారు.

అభిషేకం చేసేటప్పుడు ఊడి పడిపోయి ఉంటుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.కొన్ని రోజులుగా అమ్మవారి మకుటంలో పచ్చ రాయి లేకుండానే పూజారులు అభిషేకాలు నిర్వహిస్తుండడం విశేషం.

అయితే దీనిపై అధికారులను ప్రశ్నిస్తే తిధి, నక్షత్రం చూసి అమ్మవారి మకుటం లో ఆ వజ్రాన్ని అమరుస్తామంటూ సమాధానం చెబుతున్నారు.ఇటీవల ఎదో ఒక వివాదం తో అమ్మవారి ఆలయం నిత్యం వార్తలలో నిలుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

అయితే ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.అయితే భక్తులు మాత్రం అమ్మవారికి అసంపూరణమైన కిరీటాన్ని అలంకరించి అభిషేకాలు చేస్తుండడం తో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ఆందోళన చెందుతున్నారు.

అమ్మవారికి ఆ విధంగా అసంపూర్ణమైన నగలను అలంకరించకూడదని కానీ గత కొద్దీ రోజులుగా ఆలయ పూజారులు,అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే అసలు వజ్రం ఎలా పోయింది అన్న దానిపై మాత్రం అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు.

ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube