హార్దిక్ తన స్వార్ధం కోసం ఏమైనా చేస్తాడు అంటున్న అతను! అందుకే కొట్టానని ప్రకటన

గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ని సభలో ప్రసంగిస్తూ ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి అతనిని లాగి పెట్టి కొట్టాడు.

ఆ తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు అతనిని పట్టుకొని చితకొట్టి పోలీసులకి అప్పగించారు.

కార్యకర్తల దాడిలో గాయపడిన ఆ వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు.అతను మీడియాతో మాట్లాడుతూ హార్దిక్ పటేల్ ని కొట్టడానికి కారణం తెలియజేసారు.

పటీదార్‌ ఉద్యమానికి నాయకత్వం వహించి పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు.ఈ నేపథ్యంలో తమ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తరుణ్‌ తెలిపారు.

అహ్మదాబాద్‌లో ఆయన ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో నేను నా కుమారుడికి మందులు తీసుకురావడానికి మెడికల్‌ షాప్‌ కోసం వెతికాను.కానీ, ఆ సమయంలో అన్ని షాపులు మూసేసి ఉన్నాయి.

Advertisement

హార్దిక్‌ పటేల్ తనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రోడ్లపై బంద్‌లు నిర్వహించేవాడు.తనకి స్వార్ధం కోసం ప్రజలని ఇబ్బందులకి గురి చేసేవాడు.

అతని ఎదుగుదల కోసమే మాటిమాటికి పటీదార్ ఉద్యమం పేరుతో గుజరాత్‌ మొత్తం బంద్‌కు పిలుపునిచ్చేవాడు.ఆయన గుజరాత్‌ హిట్లర్‌’ అని తరుణ్‌ వ్యాఖ్యానించారు.

హార్దిక్ పటేల్ ని కొట్టడం వెనుక అతని ఆవేదన ఉందని మాటల బట్టి అర్ధమవుతుంది.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు