అంబానీ కంటే తానే ధనవంతుడిని అని ప్రకటించుకున్న తమిళనాడు వ్యక్తి.. ఎందుకు అలా చేశాడో తెలుసా?

ఇండియాలో ముఖేష్‌ అంబానీ కంటే ధనవంతులు ఎవరు లేరు.ఆయన ఆస్తులు రోజు రోజుకు వందల కోట్ల చొప్పున పెరుగుతూనే ఉన్నాయి.పెద్ద ఎత్తున పెరుగుతున్న ఆయన ఆస్తులను అందుకోవడం ఇండియాలో మరెవ్వరికి ప్రస్తుతానికి అయితే సాధ్యం అవ్వడం లేదు.‘జియో’ను ప్రారంభించిన తర్వాత అంబానీ మరింతగా ఉన్నతుడు అయ్యాడు.అయితే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన ఆస్తి అంబానీ ఆస్తి కంటే ఎక్కువ అంటూ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం జరిగింది.లక్షల కోట్ల రూపాయలు తనుకు ఉన్నాయని, అలాగే తనకు అప్పులు కూడా భారీగా ఉన్నాయి అంటూ అతడు నామినేషన్‌ పత్రాలతో పాటు ఇచ్చిన ప్రమాణ పత్రంలో జోడించడం జరిగింది.

 Tamilnadu Man Announces He Is The Richest Man Than Ambani-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులో పార్లమెంటు ఎన్నికలతో పాటు, కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.ఆ ఉప ఎన్నికల్లో భాగంగా పెరంబూర్‌ అసెంబ్లీ నియోజక వర్గంకు జె మెహన్‌ రాజ్‌ అనే వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.

ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా తన పేరుమీద ఉన్న ఆస్తులు, తన కుటుంబ సభ్యుల పేర్లమీద ఉన్న ఆస్తుల వివరాలను వెళ్లడించాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను కొందరు తప్పుల తడకగా ఇస్తూ ఉంటారు.తాజాగా జె మోహన్‌ రాజ్‌ కూడా తన ఆస్తుల వివరాలను తప్పుల తడకగా ఇచ్చాడు.

ఆయనకు లేని ఆస్తులను చూపించడంతో పాటు, లేని అప్పులను కూడా చూపించే ప్రయత్నం చేశాడు.తనకు 1.76 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఆయన చెప్పాడు.అదే విధంగా ప్రపంచ బ్యాంక్‌ నుండి తాను ఇప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయలను అప్పు తీసుకున్నాను అంటూ చెప్పాడు.ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎందుకు ఇంత అప్పు చేశాడని అంతా ఆశ్చర్యపోతున్న సమయంలో ఆయన ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు అంటూ తేలిపోయింది.

అఫిడవిట్‌లో ఇలాంటి తప్పులు చూపించినందుకు ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది.ఎన్నికల కమీషన్‌ ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలకు పాల్పడుతుందనేది చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube