90’s లో యువతను ఒక్క ఊపు ఊపిన హీరోయిన్….రమ్య కృష్ణ.
అప్పుడే కాదు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది అని చెప్పడానికి నిదర్శనం బాహుబలి.బాహుబలి లో శివగామి దేవి గా రమ్య నటనకు దాదాపు అందరూ కూడా ఫిదా అయిపోయారు.‘నా మాటే శాసనం’ అంటూ రమ్య చెప్పిన డైలాగ్ చిన్న పిల్లలను సైతం ఆకట్టుకుంది.అయితే ఇప్పుడు తాజాగా రమ్య బాలీవుడ్ నటుడు అమితాబ్ పక్కన నటిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ చిత్రం కోలీవుడ్ లో రాబోతుంది.అంటే అమిత్ జీ కోలీవుడ్ లో చేస్తున్న ఉయర్నత మనిధన్ చిత్రంలో అమితాబ్ కు జోడీ గా రమ్య నటిస్తున్నట్లు తెలుస్తుంది.
తమిళ వానన్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో హీరో, డైరెక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.తమిళం,హిందీ భాషల్లో ఈ చిత్రం ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది.ఈ చిత్రంలో దాదాపు 20 ఏళ్ల తరువాత రమ్య,అమితాబ్ లు కలిసి నటిస్తున్నారు.1998 లో వీరిద్దరూ కలిసి బడే మియా చోటే మియా అనే హిందీ చిత్రంలో నటించగా దాదాపు ఇన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తుండడం విశేషం.అయితే ఈ చిత్రంలో అమితాబ్ కు ధీటుగానే రమ్య క్యారక్టర్ ఉండనుంది.అంటే ఈ చిత్రంలో రమ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందట.బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మరో సారి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రమ్య కు మళ్లీ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ముంబై లో జరుగుతుండగా ఇప్పటికే రమ్య షూటింగ్స్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.







