పాకిస్తాన్ కి దొంగ దెబ్బ కి సరైన సమాధానం చెప్పిన భారత్

పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడుల తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఆదే ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.సైన్యంతో పాటు, సామాన్య ప్రజలని లక్ష్యంగా చేసుకొని దాడులకి తెగబడుతుంది.

 Pakistan Army Violates Ceasefire Along Loc-TeluguStop.com

అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి భారత్ కూడా అదే రీతిలో సమాధానం చెబుతుంది.వాళ్ళని ఎ మాత్రం ఉపేక్షించే అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ దాడులని తిప్పికొడుతూ ప్రజలని రక్షించే ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు.మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పూంచ్, నౌషెరా సెక్టార్‌ పరిధిలోని రాజౌరీలో పాక్‌ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి.పాకిస్తాన్ దాడులని ప్రతిఘటించేందుకు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి రాక్‌చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్‌ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది.

ఈ ఘటనలో ముగ్గురు పాక్‌ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వ విభాగం తెలిపింది.

ఇలా వరుస కాల్పులతో సరిహద్దులో ఓ రకమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలో శాంతిభద్రథలకి విఘాతం కలిగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ కాల్పులకి పాల్పడుతుంది అని తెలుస్తుంది.ఇలా కాల్పులు చేస్తూ మరో వైపు నుంచి ఉగ్రవాదులని దేశంలోకి పంపించాలకే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తుందని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube