దేశ రాజధాని ఢిల్లీలో వింతైన విడ్డూరం జరిగింది.ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల వృద్దుడు ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందాడు.
లేటు వయసులో ఆయనకు ఎవరితో అయినా డేటింగ్ చేయాలనిపించింది.విదేశాలకే పరిమితం అయిన డేటింగ్ వెబ్ సైట్లను ఆయన వెదికాడు.
ఇండియాలో కూడా ఆ తరహా డేటింగ్ సైట్లు, యాప్స్ ఉన్నాయని అతడు గుర్తించాడు.వెంటనే తన డీటైల్స్ ఇచ్చి రిజిస్టర్ చేయించుకునానడు.
వెబ్ సైట్‌లో ఆయన వివరాలు ఇచ్చిన వెంటనే ఒక మహిళ ఫోన్ చేసింది.మీరు ప్రైమ్ యూజర్ అవ్వాలి, అందుకోసం 25 వేల రూపాయలు చెల్లించండి అంటూ చెప్పింది.
25 వేల రూపాయలు చెల్లించి వెంటనే ప్రైమ్ మెంబర్ షిప్ పొందాడు.ఆ తర్వాత ఆయనకు కొన్ని ఫొటోలు పంపించారు.వారిలో మీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోండి అంటూ ఆయనకు సదరు వెబ్ సైట్ వారు ఆఫర్ ఇచ్చారు.అందులోంచి ఒక మంచి అందమైన మహిళను ఆ వృద్దుడు ఎంపిక చేసుకున్నాడు.
ఆమెతో డేటింగ్ మొదలు పెట్టాలంటే 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ వెబ్ సైట్ వారు సూచించగా, వారు అడిగిన వెంటనే ఆ మొత్తం డబ్బులను ఇచ్చాడు.ఆ తర్వాత ఆ మహిళ ఫోన్‌లో కొన్ని సార్లు మాట్లాడింది.
కలిసేందుకు టైం కావాలంటూ నాన్చుతూ వచ్చింది.

ఆమె కూడా ఆ ఖర్చు ఈ ఖర్చు అంటూ చాలా రోజుల పాటు డబ్బులు లాగింది.వస్తున్న వస్తున్న అంటూ మరో 35 లక్షల వరకు ఆయన నుండి లాంగింది.రిటైర్‌మెంట్ సమయంలో వచ్చిన డబ్బులు అన్ని కూడా వారికే పెట్టేశాడు.
ఎంతకు ఆమె రాకపోవడంతో మరోసారి ఇంటర్నెట్‌లో ఆ వెబ్ సైట్ గురించి చూడగా కొన్ని రివ్యూలు కనిపించాయి.ఆ రివ్యూల్లో ఆ వెబ్ సైట్ చీటింగ్ చేసే వెబ్ సైట్ అని, మమ్ములను మోసం చేసింది అంటూ చెప్పడం జరిగింది.
దాంతో ఆ వృద్దుడు కృంగిపోయాడు.ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఉండిపోయాడు.కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు ఆ డబ్బు గురించి గట్టిగా అడగడంతో చేసేది లేక అసలు విషయం చెప్పగా, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.కుటుంబ సభ్యులు సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఫోన్ నెంబర్ లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్ని కూడా తీసుకున్నారు.ప్రస్తుతం విచారణ జరుగుతుంది.








