నిజ జీవితంలో హీరోయిన్ ని భయపెట్టిన ఎర్ర చీర దెయ్యం

ఈ మధ్యకాలంలో హర్రర్ కామెడీ చిత్రాలు అన్ని ఇండస్ట్రీలలో భాగా ఫేమస్ అయిపోయాయి.భయపెట్టి నవ్వించడానికి దర్శకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

 Siddhi Idnani Saw The Ghost In Her Life-TeluguStop.com

భయం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కామెడీ అనే విషయం గ్రహించిన దర్శకులు తక్కువ బడ్జెట్ తో ఆ తరహా సినిమాలు తీసి హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు.రాఘవ లారెన్స్ లాంటి దర్శక హీరోలు అయితే దెయ్యాలతో సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే నిజంగా నిజ జీవితంలో దెయ్యాలు ఉన్నాయా అంటే చాలా మంది ఉన్నాయనే అంటారు.అయితే దెయ్యం ఎలా ఉంది అంటే మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేరు.

అందుకే చాలా మంది సరదాగా దెయ్యాల గురించి మాట్లాడుతూ దెయ్యం ఎప్పుడు రాత్రి పూట అది కూడా తెల్లచీర కట్టుకునే కనిపిస్తుందా అంటూ సెటైర్ లు వేస్తూ ఉంటారు.

అయితే మనిషిలో అంతర్లీనంగా ఉన్న భయం హిస్టీరియాగా బయటకి రావడమే దెయ్యం పట్టడం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమా ప్రేమకథా చిత్రమ్ కి సీక్వెల్ వస్తుంది అందులో ఒక హీరోయిన్ గా నటించిన సిద్ధీ ఇద్నాని తనకి నిజజీవితంలో కూడా దెయ్యం చూసిన అనుభవం ఉందని చెబుతుంది.ఓ సారిలో కారులో వెళ్తూ ఉంటే సడెన్ గా డ్రైవర్ కారు ఆపేసాడు.

ఎం జరిగిందా అని చూస్తే ఓ ఎర్ర చీర దెయ్యం కారు దగ్గరకి వచ్చి మాయం అయ్యింది అంటూ స్టొరీ చెప్పుకొచ్చింది.అలాంటి వాస్తవంగా తనకి జరిగిన అనుభవంతో సినిమా తీస్తే అందులో నటించాలని ఉందని కూడా చెప్పింది.

మరి అది జరుగుతుందో లేదో అనేది వేచి చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube