టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో నితిన్ తన చివరి చిత్రం చల్ మోహన రంగ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.అయితే ఈ గ్యాప్ లో అదిరిపోయే కథలని సెట్ చేసుకున్న ఈ హీరో ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటిని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం మొదలెట్టాడు.
తాజాగా చలో ఫేం వెంకి కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లుక్ కూడా రివీల్ చేసాడు.
ఇదిలా ఉంటే తనకి గుండె ఝారీ గల్లంతయ్యిందే సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరపైకి తీసుకెళ్లబోతున్నాడు.
ఇదిలా ఉంటే నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి నితిన్ అనౌన్స్ చేసాడు.
అది కూడా ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాణి ట్రాయాలజీ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలియజేసారు.కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రేష్ట బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కబోతుంది అని కూడా స్పష్టం చేసారు.
ఇక ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలియజేసారు.

ట్రయాలజీ ఒకే కథ మూడు భాగాలుగా వస్తుంది.ఇప్పటి ఇండియన్ స్క్రీన్ మీద రెండు భాగాలుగా వచ్చిన సినిమాలే తప్ప మూడు భాగాలుగా వచ్చిన చాలా తక్కువ, సింగం సిరిస్ మాత్రమే మూడు భాగాలలో వచ్చింది.ఇప్పడు నితిన్ తెలుగులో ఆ ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకి పవర్ పేట అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.







