కాపు ఓట్లపై టీడీపీ గురి ! రంగంలోకి వంగవీటి

ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబు కి బాగా తెలుసు.

ఎన్నికల్లో గట్టెక్కడమే ధ్యేయంగా పనిచేస్తున్న బాబు కీలక సామజిక వర్గాల ఓట్లపై గురిపెట్టాడు.

దీనిలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా అవమానాలు ఎదుర్కొని ఆ పార్టీ నుంచి బయటకి వచ్చేసాను అని చెప్పుకుంటున్న వంగవీటి రాధను టీడీపీ లో చేర్చుకోవడమే కాకుండా ఆయన్ను ఎన్నికల ప్రచారం నిమిత్తం రాష్ట్రమంతా తిప్పాలని భావిస్తున్నాడు.దీనికి రాధా సైతం సిద్దంగానే ఉన్నట్టు చెప్పడమే కాదు అప్పుడు రంగంలోకి దిగి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ టీడీపీ మైలేజ్ పెంచుతున్నాడు.

అసలు వంగవీటి టీడీపీ లో టికెట్ ఇస్తామని చెప్పినా కాదు కాదు వైసీపీ అంతమే నా పంతం అంటూ ఆయన వైసీపీ కి వ్యతికరేకంగా కాపు సామజిక వర్గాన్ని ఏకం చేసే పనిలో పడ్డాడు.అందుకే తెలుగుదేశం పార్టీ కూడా వంగవీటిని పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలకు దింపేసింది.

కీలకమైన నియోజకవర్గాల్లో పార్టీ పిలుపు మేరకు ప్రచారం చేయాలని, అలాగే మిగతా సమయాల్లో తన వెంట ప్రచారానికి రావాల్సిందిగా బాబు రాధకు సూచించాడు.దీనికి ఆయన కూడా ఒకే చెప్పాడు.

Advertisement

ఇప్పుడు ఆయన పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జాబితాను కూడా పంపారు.

ఇప్పటికే వంగవీటి రాధా, వల్లభనేని వంశీతో పాటు పలువురు తెలుగుదేశం అభ్యర్దుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.తనకు గట్టి పట్టు ఉన్నప్రాంతమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమాతో పాటు ర్యాలీలో కూడా పాల్గొన్నారు.

టీడీపీ ఆయన విషయంలో ఇంత హైప్ క్రియాట్ చేయడం వెనుక కారణం కూడా ఉంది.కాపు సామజిక వర్గంలో వంగవీటి గట్టి పట్టు ఉంది.ముఖ్యంగా కోస్తా ఆంధ్రా ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

రాధా కూడా తన ఇగోలన్నీ పక్కన పెట్టి టీడీపీ నాయకులతో కలిసిపోతున్నారు.వల్లభనేని వంశీ, కొడాలి నాని, వంగవీటి రాధా మిత్రులు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

వల్లభనేని వంశీకి నేరుగా ప్రచారం చేశారు.కానీ కొడాలి నానికి చేసే అవకాశం లేదు.

Advertisement

గుడివాడలో కాపు ఓట్లు చాలా కీలకం.నాని తో దేవినేని అవినాష్ పోటీ చేస్తుండడంతో అక్కడ మినహా మిగతా చోట్ల ప్రచారం చేసేందుకు రాధా సిద్ధం అవుతున్నాడు.

రాధా ప్రభావంతో కాపు ఓట్లు తమ ఖాతాలో పడతాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది.

తాజా వార్తలు