వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సిట్ విచారణ వేగవంతం చేస్తుంది.ఈ హత్యకి రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో ఓ వైపు విచారణ కొనసాగిస్తూనే మరో వైపు కుటుంబ సంబంధ కారణాలని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
దీనికోసం వైఎస్ వివేకానంద సోదరులని కూడా సిట్ అధికారులు విచారించారు.ఇదే సమయంలో వివేకానంద హత్యకి సంబంధించి మరో కొత్త కోణం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో అటు వైపు నుంచి కూడా విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వివేకానంద హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని కారు డ్రైవర్ పరమేశ్వర్ రెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇన్ని రోజులు హాస్పిటల్ లో ఉన్న అతన్ని కడప పోలీసులు విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.మరో వైపు నేను జగన్ కి మేలు చేసేవాడినే తప్ప కీడు చేసే వ్యక్తిని కాదని, తన కొడుకు ఆపరేషన్ కోసం జగన్ 15 లక్షలు ఇచ్చారని, అలాంటి వ్యక్తి కుటుంబం కోసం అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న తప్ప హత్య చేసే వ్యక్తిత్వం తనకి లేదని పరమేశ్వర్ రెడ్డి అంటున్నారు.
మరి దీనిలో ఎవరు హంతకులు అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.







