క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ తన నెక్ట్ సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొంత కాలంగా టాక్ వినిపించింది.దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుందని, స్టొరీ కూడా ఫైనల్ అయ్యిందని, ఇక బాలీవుడ్ భామని మహేశ్ కోసం హీరోయిన్ గా ఫైనల్ చేసే పనిలో సుకుమార్ ఉన్నాడని టాలీవుడ్ లో జోరుగా కథనాలు వినిపించాయి.
అయితే ఊహించని విధంగా సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ఒకే చేసుకున్నాడు.
ఈ నేపధ్యంలో మహేశ్ తో సినిమా వుందా లేదా అనే అనుమానం అందరిలో కూడా మొదలైంది.
అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ సుకుమార్ తో సినిమా విషయంపై క్లారిటీ ఇచ్చాడు.సుకుమార్ తో ప్రస్తుతం సినిమా చేయడం లేదని, అనుకోని కారణాల వలన మా ఇద్దరికి సరిపోయే స్టొరీ సెట్ కాకపోవడంతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోతున్నాం అని స్పష్టం చేసిన మహేశ్, భవిష్యత్తులో సుకుమార్ తో తప్పకుండా మరో మంచి చిత్రంతో ముందుకు వస్తా అని ట్విట్టర్ లో తెలియజేసారు.







