తెలుగు రాష్ట్రాలలో రాజకేయాలు ఎలా ఉంటాయో సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లో కూడా నటుల మధ్య రాజకీయాలు అలానే వుంటాయి.ఇక మా అసోసియేషన్ ఎన్నికలకి మార్చి 8 వేదిక కాబోతుంది.
దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఆరంభం అయ్యింది.తాజాగా ఈ రోజు సాయంత్రం మా అసోసియేషన్ కార్యాలయంలో నరేష్, శివాజీరాజా రెండు వర్గాలుగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
ఇక నరేష్, శివాజీరాజా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.ఇక జీవితా రాజశేఖర్, రఘుబాబు జనరల్ సెక్రెటరీ పదవికి నామినేషన్ వేశారు.
అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కోసం శ్రీకాంత్, రాజశేఖర్ పోటీ పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో శివాజీరాజా, నరేష్ మధ్య ఫండ్స్ విషయంలో కొంత గొడవలు జరిగాయి.
మా సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి మీడియా ముందుకి వచ్చి గొడవలు పడ్డారు.అయితే ఊహించని విధంగా కొద్ది రోజులకి మరల అందరూ ఒక మాట మీదకి వచ్చారు.
అయితే అప్పటి నుంచి మా అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయి నడుస్తుందని టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో తాజాగా జరగబోయే ఎన్నికల కోసం నరేష్ వర్గం నుంచి జీవిత రాజశేఖర్, రాజశేఖర్ పోటీ పడుతూ వుండగా శివాజీరాజా వర్గం నుంచి అతనితో పాటు రఘుబాబు, శ్రీకాంత్ పోటీలో వున్నారు.
మరి ఇప్పుడు ఈ మా అసోసియేషన్ ఎన్నికలలో రాజకీయాలు ఎలా నడుస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
.






