సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి సాయి పల్లవికి ఒక చెల్లి ఉంది, ఆమె పేరు పూజా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్క చెల్లి సాయి పల్లవి, పూజా సేమ్ టు సేమ్ ఉంటారు.
ఇద్దరు కూడా సేమ్ డ్రస్‌లు వేసుకుని చాలా సార్లు ఫొటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో పూజా కూడా బాగా ఫేమస్ అయ్యింది.ఈమద్య పూజా తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ఫొటోలు దిగింది.
ఆ ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి.దాంతో పాటు పూజా హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది, త్వరలో ధనుష్ హీరోగా తెరకెక్కబోతున్న మూవీలో పూజా హీరోయిన్‌గా నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై సాయి పల్లవి టీం క్లారిటీ ఇచ్చింది.పూజా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు.ప్రస్తుతం మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్న పూజాకు నటనపై ఆసక్తి లేదు.సాయి పల్లవిలా డాన్స్‌లో కూడా పూజాకు ఆసక్తి లేదు.ఆమె దృష్టి మొత్తం చదువుపైనే ఉంది.మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పూజా సినిమాల్లోకి రాదు, ఆమె మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ చేసేందుకు విదేశాలకు వెళ్లనుందని వారు ప్రకటించారు.

ఇక ధనుష్‌తో ఫొటోలపై స్పందించిన సదరు టీం.ధనుష్‌తో పూజా ఫొటోలు దిగిన మాట వాస్తవమే, అయితే అది కేవలం ఫ్యాన్ మూమెంట్స్ మాత్రమే, అందులో చర్చించుకోదగ్గ అంశం ఏమీ లేదు.ధనుష్ అంటే పూజాకు అభిమానం, సాయి పల్లవి ‘మారి 2’ చిత్రంలో నటిస్తున్న సమయంలో ధనుష్ తో కలిసి ఫొటోలు దిగి సంతోషించింది.అంతకు మించి మరేం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
సాయి పల్లవి సోదరి హీరోయిన్‌గా ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలకు దీంతో అయినా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.తెలుగు, తమిళంలో దూసుకు పోతున్న సాయి పల్లవి స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.