రేపే మంత్రివర్గ విస్తరణ ..? మంత్రులు వీరేనా ...?

తెలంగాణలో ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయింది.

దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకు కొత్త కేబినెట్లో తొలి విడతగా ఛాన్స్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.

అయితే కేసీఆర్ క్యాబినెట్ లో మొత్తం కొత్తవాళ్లే మంత్రి పదవులు చేపడతారు అని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.దీనిపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

అది కాకుండా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.అలాగే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కేబినెట్లో స్థానం ఉంటుందా లేదా అని సందేహాలు కూడా భారీగా వచ్చాయి.

అయితే అయితే ఈ విషయంలో కెసిఆర్ మాత్రం ఎటూ తేల్చలేదు ఎటువంటి లీకులు కూడా.బయటకు రాకుండా చూసుకున్నాడు.

Advertisement

తొలివిడత మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది పోటీ పడుతున్నారు.అయితే కేసీఆర్ మాత్రం ఎవరికి అవకాశం ఇస్తారు అనేది మాత్రం ఎవరికీ తెలియ కుండా ఉంది.ఈ నేపథ్యంలో రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణ కు సంబంధించి కొంతమంది వ్యక్తులు పేర్లు కేసీఆర్ బయటకి లీకులు ఇచ్చాడు.

ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేబినెట్లో చోటు దక్కుతుందని ఈ లీకుల సారాంశం.అలాగే అసెంబ్లీ స్పీకర్ గా పద్మారావు అని ప్రచారం జరుగుతుంది.

లోక్ సభ ఎన్నికల అనంతరం జరగబోయే కేబినెట్ విస్తరణలో మరికొంత మంది సీనియర్ నాయకులు.మాజీ మంత్రులకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

అలాగే ఖమ్మం జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.అయితే తొలి విడతలో మంత్రి పదవులు దక్కే వారి వివరాలు బయటకి లీకివ్వడంతో ఆశావహులు చాలా మంది అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.అందుకే గత కొద్దిరోజులుగా ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతూ .తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించి కేసీఆర్ మాత్రం కొత్త క్యాబినెట్ ఎలా ఉండాలో ముందుగానే ఫిక్స్ అయిపోయి మరి మరి ఉన్నాడు కదా !.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు