ఒకప్పుడు డబ్బులు బ్యాంకు నుండి డ్రా చేసేందుకు గంటల తరబడి బ్యాంకు క్యుల్లో నిలబడాల్సి వచ్చేంది.చెక్ లేదా ఓచర్ రాసి, దానిని ఇచ్చి, అక్కడ టోకెన్ తీసుకుని, ఆ టోకెన్ నెంబర్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేది.
కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.ఏటీఎంలు వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య సగానికి పైగా తగ్గింది.
ముఖ్యంగా నగదు విత్‌డ్రా చేసుకోవాలనుకున్న వారు 90 శాతంకు పైగా తగ్గారు.పెద్ద మొత్తాలు డ్రా చేసుకోవాలనుకునే వారు మాత్రమే ఏటీఎంలకు వెళ్తున్నారు.
ఇప్పుడు ఏటీఎంలను క్లోన్ చేసి, అకౌంట్స్‌లో ఉన్న డబ్బును లాగేసుకునే బ్యాచ్‌లు తయారు అయ్యాయి.
కొన్ని వందల, వేల ఏటీఎంలను క్లోన్ చేసి వాటి ద్వారా డమ్మీ ఏటీఎం కార్డులను తయారు చేసి డబ్బులు డ్రా చేయడం జరింది.
అందుకే క్లోనింగ్‌కు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రతి ఒక్క ఏటీఎం కార్డుకు కూడా చిప్ ఉండాల్సిందే అంటూ అన్ని బ్యాంకులను ఆదేశించింది.ఇప్పటికే దాదాపు అన్ని బ్యాంకులు కూడా కొత్త ఏటీఎంలను ఇచ్చే పని మొదలు పెట్టగా, మరి కొన్ని బ్యాంకులు 90 శాతంకు పైగా ఏటీఎంలను తమ కస్టమర్లకు ఇచ్చేసింది.
ఇదే సమయంలో కొత్త ఏటీఎం కార్డుల గురించి అవగాహణ లేకపోవడం వల్ల వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

కొత్త ఏటీఎం కార్డుల వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం :
కొత్తగా వచ్చే ఏటీఎం కార్డులకు చిప్ ఉండటం వల్ల క్లోనింగ్ చేయడం అనేది దాదాపు అసాధ్యం.మన కార్డును ఎవరికైన ఇచ్చినా దాన్ని క్లోనింగ్ చేయడం సాధ్యం కాదు.ఎందుకంటే సాదారణంగా కార్డును క్లోన్ చేయవచ్చు, కాని చిప్ ఉన్న కార్డును క్లోన్ చేయడం సాద్యం అయ్యే పని కాదు.
ఇక చిప్ ఉన్న ఏటీఎం కార్డును స్వైపింగ్ సమయంలో కూడా సునాయాసంగా యూజ్ చేసుకోవచ్చు.కేవలం కార్డును స్కాన్ చేసినా చాలు.ఆ కార్డుకు సంబంధించిన డీటైల్స్ మెషిన్‌లో వస్తాయి.స్వైప్ సమయంలో కార్డు పాడు అవుతుందనే భయం లేదు.

ఏటీఎం ఎక్కడైనా పడిపోతే వెంటనే బ్లాక్ చేసే అవకాశం ఉంది.పాత కార్డులకు ఉన్నంత ప్రాసెస్ ఇప్పుడు లేదు.
చిప్ ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత ఏటీఎంలలో సాఫ్ట్ వేర్ కూడా మార్చేశారు.గతంలో ఏటీఎం కార్డు లోనికి వెళ్లి డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు వచ్చేది.
కాని ఇప్పుడు అలా కాదు, కార్డును పెట్టి, తీసి ఆ తర్వాత డబ్బులు డ్రా చేసుకునే విధంగా సాప్ట్ వేర్ అప్‌డేట్ అయ్యింది.ఇలాంటి కొత్త పద్దతి వల్ల ఏటీఎం కార్డులను మిషన్‌లో ఉంచి మర్చి పోయే అవకాశం ఉండదు.
అందుకే మీరు వెంటనే మీ కొత్త చిప్ ఉన్న ఏటీఎంను తీసుకోండి.
అందరికి ఉపయోగపడే ఈ విషయాన్ని స్నేహితులు, సన్నిహితులతో షేర్ చేసుకోండి.