ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు పూర్తిగా అసమర్ధత … అవినీతిలో కూరుకుపోయాయని… వాటికి ప్రత్యామ్న్యాయంగా మరో రాజకీయ పార్టీ ఏపీలో ఎంటర్ అవ్వబోతోందని … ఏపీ ప్రజలు ఊహించుకున్న ఊహలు ఊహాలుగానే ఉండిపోయినట్టు కనిపిస్తున్నాయి.వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ విచారణాధికారిగా… లక్ష్మీనారాయణ చురుకైన పాత్ర పోషించారు.
ఆ సమయంలోనే కర్ణాటకలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కి సంబంధించిన కేసును కూడా డీల్ చేసి లక్ష్మీ నారాయణ దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు.ఇక ఆ తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

ఈ మేరకే ఏపీలో అనేక ప్రాంతాల్లో పర్యటించి స్పీడ్ పెంచడం ఇవ్వన్నీ జరిగిపోయాయి.కానీ ఆ తర్వాత కార్యాచరణ విషయంలో మాత్రం వెనుకబడిపోయారు.పకడ్బందీగా అడుగులు వేయడంలో ఆయనకు సరైన రాజకీయ అనుభవం లేకపోవడంతో.ముందుకు వెళ్లలేక పోయారనే ప్రచారం జరిగింది.అయితే సొంత పార్టీ పెడతారని అంతా ఊహించుకుంటున్న సమయంలో ఆయన లోక్ సత్తా పార్టీ వైపు చూసారు.కానీ ఆ తరువాత ఆ పార్టీలో చేరకుండా సైలెంట్ అయిపోయారు.
ఈ విషయంలో మొదట్లోనే క్లారిటీ ఇచ్చి తనకు ఇష్టమైన పార్టీని ఎంపిక చేసుకుని ఉంటే ఈ పాటికి రాజకీయం ఒంటబట్టి ఉండేది.కానీ గత ఉద్యోగపు ఇమేజ్ ఆయనను వెంటాడుతూనే ఉంది.
అందుకే ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు చూస్తే… ఎన్నికల ప్రకటన మరో రెండు, మూడు వారాల్లో వస్తుంది తేలిన తర్వాత కూడా.
ఆయన ఇంకా మౌనం వీడకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఆయన సన్నిహితులకు సైతం అంతుపట్టడంలేదు.ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే విషయంలో వెనకడుగు వేసినట్టే కనిపిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని పెట్టడం… ముందుకు తీసుకెళ్లడం కష్టతరమని … అలా అని ఏదో ఒక పార్టీలో చేరి వారు చెప్పినట్టు వారి ఆదేశాల ప్రకారం నడుచుకోవడం తనకు చిన్నతనంగా ఉంటుందేమో అన్న ఆలోచనతో… జేడీ వేరే పార్టీలో చేరేందుకు మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది.అందుకే ఇక ఆయన రాజకీయాలని పూర్తిగా పక్కనపెట్టేసి ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.







