మెగా బ్రదర్ నాగబాబు చిల్లర వీడియోలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.మొన్నటి వరకు నాగబాబు చేసిన వీడియోలు నవ్వు తెప్పిస్తే ఇప్పుడు నాగబాబు చేస్తున్న చేష్టలు నవ్వులు తెప్పిస్తున్నాయి.
నాగబాబు తాజాగా మై ఛానల్ నా ఇష్టం అంటూ ఒక ఫన్నీ స్కిట్‌ను విడుదల చేశాడు.స్కిట్ నాది, టైటిల్ మీది అంటూ నాగబాబు విడుదల చేసిన ఈ స్కిట్ మరీ ఓవర్ అనిపించుకుంటుంది.
అత్యంత చీప్ కామెడీతో ఈ స్కిట్ సాగిందని స్వయంగా మెగా అభిమానులు కూడా అంటున్నారు.
ఆమద్య బాలకృష్ణపై వ్యాఖ్యలు చేస్తూ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపిన నాగబాబు ఇలా ఫన్నీ వ్యాఖ్యలు చేస్తూ, ఫన్నీ స్కిట్‌లతో పరువు పోగొట్టుకుంటున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్న నాగబాబు వీడియోలు ఇకపై అయినా ఆపితే బాగుంటుందని కొందరు అంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి గారినే కొందరు స్వయంగా మీ తమ్ముడు స్కిట్‌లు, చిల్లర వీడియోలు ఆపితే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారట.

నాగబాబు మాత్రం యూట్యూబ్ ద్వారా వచ్చే చిల్లర డబ్బుల కోసం ఇలా చిల్లర పనులు చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మెగా బ్రదర్ అయ్యి ఉండి ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి మీకు అన్న, మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ మీకు తమ్ముడు.వారి గౌరవం కోసం అయినా మీరు ఈ వీడియోలు ఆపండి బాబోయ్ అంటూ అభిమానులు మరియు సోషల్ మీడియా జనాలు కోరుతున్నారు.
మరి నాగబాబు ఊరుకుంటాడా చూడాలి.







