ఆమరణ నిరాహారదీక్ష చేయబోతున్న'అన్నాహజారే'

సామాజిక కార్యకర్త అన్నా హజారే జనవరి 30 నుంచి నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు సోమవారం ప్రకటించారు.రైతుల డిమాండ్లు, లోక్ పాల్ ఏర్పాటు కోరుతూ తన సొంత గ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్షకు కూర్చుంటానని తెలిపారు.

 Anna Hazare Will Go On Indefinite Hunger Strike-TeluguStop.com

తన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేసేవరకు తన దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు.న్యూఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా హజారే మాట్లాడారు.

సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా లోక్ పాల్, లోకాయుక్త చట్టం 2013ని అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.

nt

రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆదేశాలు అమలుకు నోచుకోకపోతే దేశం ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కేంద్రంలోని మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలకు పోతోందని విమర్శించారు.ఇది ప్రభుత్వమా లేక ఏదైనా పచారీ కొట్టా అనేది అర్థం కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తనకు ప్రభుత్వం ఇచ్చే అబద్ధపు వాగ్దానాలపై ఇక నమ్మకం లేదని, తుది శ్వాస వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.తన ఈ దీక్షకు రాష్ట్రీయ కిసాన్ మహాపంచాయత్ మద్దతు ఇస్తోందని హజారే తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube