ఈ 'కాట్రవల్లీ' హడావుడి ఏంటి...? ఈ గట్టు మీద ఉంటాడా ..? ఆ గట్టుకి వస్తాడా..?

సినీ కమెడియన్ ఆలీ వెండితెర మీదే కాదు …ఇప్పుడు పొలిటికల్ తెర మీద కూడా కామెడీ పంచేస్తున్నాడు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఆలీ జనసేన లో చేరడం ఖాయమని ముందు నుంచి అంతా లెక్కలు వేసుకున్నారు.

 Why Comedian Ali Meets All Politician In Andhra Pradesh-TeluguStop.com

అయితే ఇలా ఊహించుకున్న వారందరికీ ఝలక్ ఇస్తూ ఆయన వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యి రాజకీయాల గురించి చర్చించడం… సంచలనం రేపడం జరిగిపోయాయి.ఇంకేముంది ఆలీ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడని కాదు కాదు రాజమండ్రి అసెంబ్లీలో స్థానం నుంచి పోటీ చేస్తున్నాడని …ఈ మేరకు జగన్ నుంచి హామీ కూడా వచ్చిందని ఇలా కధనాలు ప్రచారం అయ్యాయి.

అయితే అకస్మాత్తుగా ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఆలీ టిడిపి టిడిపి లో చేరబోతున్నాడని… గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఆలీ మాత్రం మళ్లీ అందరికి ట్విస్ట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తో మరోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.అసలు ఆయన ఏ పార్టీలో చేరతారని అంత జుట్టు పీక్కున్నారు.

తాజాగా మళ్లీ చంద్రబాబుతో భేటీ అవడం మరింత గందరగోళానికి గురి చేసింది.ఈ కామెడీ స్టార్ పొలిటికల్ గేమ్ ఎవరికి అర్థం కాక అంతా అయోమయంలో పడిపోయారు.

అయితే ఆలీ టిడిపిలో చేరడం ఖాయమని గుంటూరు తూర్పు టికెట్ పై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాగానే పార్టీలో చేరుతారని తెలుగు తమ్ముళ్లు కొంతమంది డిక్లేర్ చేసారు .అయితే ఆమె మాత్రం తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశా చెప్పుకొచ్చాడు.
కానీ ఆయన మనసు మాత్రం గుంటూరు తూర్పు అసెంబ్లీ టికెట్ పైనే పడింది.ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉండడంతో ఆ టిక్కెట్ ఇవ్వాలంటూ చంద్రబాబు దగ్గర ఆలీ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

తనకు గుంటూరు వన్ లేదా విజయవాడ వన్ అదీ కుదరకపోతే తన స్వస్థలం రాజమండ్రి అసెంబ్లీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చిన పార్టీలోనే తాను చేరతానని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడట.

ఈ సందర్భంగానే తనకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితంగా ఉన్న మాగంటి మురళీమోహన్ అశ్వినీ దత్ వంటి వారితో టికెట్ విషయంలో చంద్రబాబు దగ్గరకు రాయబారం నడిపిస్తున్నాడు.వాస్తవానికి ఆలీ టీడీపీ లోనే ఉన్నా… మొదటి నుంచి యాక్టివ్ గా లేరు.అసలు టీడీపీ లో ఉన్నట్టే చాలా మందికి తెలియదు.

ఇప్పుడు ఆలీ కోరుతున్న సీట్లు లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండడంతో …వారిని తప్పించి ఆలీకి టికెట్ ఇవ్వడం పెద్ద తలనొప్పి వ్యవహారమే.

అందుకే ఈ విషయంలో చంద్రబాబు కూడా స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది.

అయితే ఆలీ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగేలా కనిపించాక్డంలేదు.తాను కోరిన ఆఫర్లను ఇచ్చిన పార్టీ లోని చేరుతానని చెప్పేస్తున్నాడు.

అందుకే ఈ మూడు పార్టీల చుట్టూ తిరుగుతూ….తన డిమాండ్లను ఆయా పార్టీల నేతల ముందు ఉంచుతూ పొలిటికల్ ట్విస్ట్ లు ఇస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube