టీడీపీలోకి హీరో మహేష్ చిన్నాన్న...?

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు.మహేష్ చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ఇటీవలే వైసీపీకి రాజీనామ చేసిన ఆయన ఫిబ్రవరి 7, 8 తేదీల్లో టీడీపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.సినీ నటుడు కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరి రావు చర్చించిన తర్వాత ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

వాస్తవంగా.శేషగిరిరావు వైసీపీలో మొదటినుంచి కీలకంగా వ్యవహరించారు.ఆయనకు జగన్ కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చాడు.

Advertisement

అయితే.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిశేషగిరి రావు వైసీపీ అభ్యర్థిగా తెనాలి నుంచి బరిలో దిగాలని భావించారు.

అయితే విజయవాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని జగన్‌ సూచించినట్లు సమాచారం.అయితే ఇది ఇష్టంలేకపోవడం.

తెనాలి అసెంబ్లీ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు