ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో పరాజయం చెందింది.ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొమ‍్మిది వికెట్ల నష్టానికి 254 పరుగులకే పరిమితమైన టీమిండియా ఓటమి చెందింది.

తొలుత బౌలర్లు విఫలమయ్యారు.తర్వాత టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.ఫలితంగా భారీ లక్ష్య ఛేదనలో స్కోరుబోర్డుపై రెండంకెల స్కోరు కూడా లేకుండానే భారత్ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది.ఆసీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ చప్పగా సాగి 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 21/3గానే ఉంది.
దాంతో చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్న కోహ్లీసేనకు మొదటి వన్డేలో ఓటమి తప్పదని అభిమానులు నిరాశ పడ్డారు.
కష్టాల్లో పడ్డ భారత్‌ను రోహిత్- ఎంఎస్ ధోని 137 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో విజయం దిశగా నడిపించి ఆశలు రేకిత్తించారు.32 ఓవర్లు ముగిసేసరికి 140/4తో భారత్ లక్ష్యం దిశగానే సాగుతున్నట్టు కనిపించింది.కానీ తర్వాతి ఓవర్లో బెహ్రెన్‌డార్ఫ్ మళ్లీ విజృంభించి ధోనీని ఎల్బీగా తిరుగుముఖం పట్టించాడు.దాంతో 137 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.39వ ఓవర్లో సిడిల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు సంధించిన రోహిత్ ఇన్నింగ్స్‌లో మరింత ఊపు తేగా.40వ ఓవర్లో దినేశ్ కార్తీక్ (12) వెనుదిరిగాడు.ఇదే ఓవర్లో రోహిత్ వన్డేల్లో తన 22వ సెంచరీ పూర్తి చేశాడు.
ఆపై రెచ్చిపోయిన రోహిత్.మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఫోర్, లియాన్ బౌలింగ్‌లో సిక్స్‌తో కదం తొక్కాడు.
స్టోయినిస్ బౌలింగ్‌లో 6,4తో బ్యాట్ ఝళిపించడంతో భారత్‌కు గెలుపు సాధ్యమేనని అనిపించింది.అయితే 45వ ఓవర్లో జడేజా అవుట్ కావడం తదుపరి ఓవర్లో రోహిత్ కూడా పెవిలియన్ చేరడంతో ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.
చివర్లో భువనేశ్వర్ వరుస ఫోర్లతో ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.

రోహిత్‌తో ఆచితూచి ఆడుతూ 93 బంతుల్లో అర్థసెంచరీ చేసిన ధోని.ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం భారత విజయ అవకాశాలపై తీవ్ర దెబ్బకొట్టింది.బెహ్రెన్‌డ్రాఫ్ బౌలింగ్‌లో బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా.
అదేమీ పట్టించుకోకుండానే అంపైర్ మైకెల్ గవుఫ్ అవుటిచ్చాడు.టీమిండియా అప్పటికే ఉన్న ఒక్క రివ్యూను వృథా చేయడంతో.
మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది.హీ రిచర్డ్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిన అంబటి రాయుడు సమీక్షకు వెళ్లి వృథా చేశాడు.
దీంతో భారత్ కీలకమైన ధోని వికెట్ కోల్పోయింది.డీఆర్ఎస్ కోరడంలో కింగ్ అయిన ధోనీ.
నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.ఈ వికెటే భారత విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఆసీస్ బౌలర్ హీరిచర్డ్సన్ ప్రస్తావించాడు.అదృష్టవశాత్తు ధోని వికెట్ లభించడంతోనే విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు.అలాగే రోహిత్ శర్మ పోరాటంపై కూడా ప్రశంసలు కురిపించాడు.3 Attachments
.






