టి.కాంగ్రెస్ లో వలసల భయం ....ముందడుగు వేస్తున్న సబితా ...?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఘోరాతి గోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ మనుగడ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

 Will Sabitha Indra Reddy Join Trs Party-TeluguStop.com

పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంతా ఓటమి చవిచూడడంతో పార్టీని ముందుండి నడిపించే వారు కరువయ్యారు.అది కాకుండా అధికార టిఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా మారడంతో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పాకులాడే పరిస్థితి కనిపిస్తోంది.

దీనికి తోడుగా టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష పేరుతో ఉన్న కొద్దిపాటి బలమైన నేతలను కల్పించే పనిలో ఉండడంతో గుబులు పట్టుకుంది.కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలు సుమారు 12 మంది టిఆర్ఎస్ లోకి జంప్ చేసే ఆలోచనలో ఉన్నారని టీఆర్ఎస్ లెక్కలు చెబుతోంది.

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరింత భూస్థాపితం చేసేందుకు టిఆర్ఎస్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.త్వరలో తెలంగాణలో పంచాయతీ, సహకార, పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో శరవేగంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.

కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి , ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధమైనట్లు ఈ మేరకు టిఆర్ఎస్ నాయకులతో చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది.సబిత పార్టీ మారడం వెనుక ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.

త్వరలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఉద్దేశంలో ఉండడంతో సబితకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.కార్తిక్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ హామీ ఇచ్చినట్టు చర్చించుకుంటున్నారు.అది కాకుండా చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో టిఆర్ఎస్ కూడా అక్కడ ప్రత్యామ్నాయ బలమైన నేత కోసం వెతుకులాట ప్రారంభించింది.ఈ క్రమంలోనే కార్తిక్ రెడ్డికి అక్కడ సీటు ఇవ్వాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారట.

ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ది కావాలన్నా.తన రాజకీయ భవిష్యత్ బాగుండాలన్న కారెక్కడమే మేలు అని సుధీర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరే ఎమ్మెల్యేల్లో సుధీర్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమనే చెబుతున్నారు.సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరూ కారెక్కితే గ్రేటర్‌లో కాంగ్రెస్ ఖాళీ అయినట్టే.వీరే కాకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు మరికొంతమంది సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవ్వడం కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవరానికి గురిచేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube