ఏదైనా హోటల్ కి వెళ్లి టిఫిన్ పార్సిల్ ఆర్డర్ ఇచ్చామంటే… ఏంచేస్తారు…? గబగబా న్యూస్ పేపర్ అందుకుని అందులో టిఫిన్ పెట్టి పొట్లం కట్టి ఇచ్చేస్తారు.ఎక్కడైనా ఇది జరిగేదే.
అయితే ఇకపై మాత్రం అలా చేయడానికి వీలు లేదు అట.ఇడ్లీ, దోశె, పూరీ, బజ్జీల వంటివి పేపర్లలో ప్యాక్ చేసి ఇవ్వరాదని, ప్లాస్టిక్ కూడా జులై 1 నుంచి వినియోగించకూడదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఉత్తర్వులు ఇచ్చిందట.
ఆహారం ప్యాకేజింగ్, నిల్వ, తీసుకెళ్లేందుకు కూడా రీయూజ్ డ్ ప్లాస్టిక్‌తో తయారయ్యే సంచులను వాడరాదని ఆదేశాలలో స్పష్టం చేశారు.ఇలా ఎందుకు అంటే… వార్తాపత్రికల తయారీకి వినియోగించే ఇంక్‌లు, డైల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నందున, వీటిల్లో ఆహార పదార్థాలను ప్యాక్ చేసి ఇవ్వకూడదని ఉత్తర్యులు వెలువడ్డాయి.
.
తాజా వార్తలు