బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందరేశ్వరి రాజకీయ ప్రస్థానం పై ఇప్పుడు నీలి నీడలు అలుముకున్నాయి.వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆమె రాజకీయ త్యాగం చేసేందుకు కూడా వెనుకాడడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
హితేష్ కి నారా లోకేష్ కి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నా ….నారా- దగ్గుపాటి కుటుంబాల మధ్య ఉన్న వైరం కారణంగా ఇప్పుడు హితేష్ వైసీపీలోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.
సొంత జిల్లా నుంచి పోటీకి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది.హితేష్ వైసీపీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటుండగా… పురందరేశ్వరి మాత్రం బీజేపీలో మంచి గుర్తింపు కలిగిన నాయకురాలిగా ఉన్నారు.కానీ ఆమె కుమారుడు ఇప్పుడు వైసీపీలో చేరబోతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె బీజేపీ నుంచి తప్పుకోవాలని చూస్తోంది.