కష్టానికి ఫలితం : శివాజీకి ఎమ్యెల్యే టికెట్ దక్కబోతోందా ...?

సినిమా హీరో శివాజీ ప్రస్తుతం రాజకీయ అంశాలపై చాలా యాక్టివ్ గా స్పందిస్తున్నారు.అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారు.

 Hero Shivaji Gets Mla Ticket From Tdp Party In 2019 Elections-TeluguStop.com

సినిమా అవకాశాలు లేకపోవడం వల్లనే… శివాజీ ఈ విధంగా.కొత్త అవతారం ఎత్తాడనీ ఆయన మీద విమర్శలు వస్తున్నా… ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా… ముందుకు వెళ్తున్నారు.

అప్పట్లో ఆపరేషన్ గరుడా అంటూ… హడావుడి చేసి సంచలన విషయాలే బయటపెట్టాడు శివాజీ.జగన్ మీద విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో జరిగిన దాడి వ్యవహారాన్ని కూడా ఆఫరేషన్ గరుడ లో భాగమే అంటూ… శివాజీ హడావుడి చేసాడు.

అంతే కాదు సాక్ష్యాత్తు కలెక్టర్ల మీదే ఆరోపణలు చేసాడు.చంద్రబాబు నిజాయితీపరుడు అంటూనే….ఆయన్ను కావాలని కలెక్టర్లు ఇబ్బందిపెడుతున్నారు అంటూ….కొత్త రాగం అందుకున్నాడు.అసలు శివాజీ మొదట్లో ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట ప్రెస్‌మీట్‌లు పెట్టేవారు.తరువాత బీజేపీకి టీడీపీ చెప్పిన తర్వాత హోదాను పక్కన పెట్టేశారు.

కేవలం కుట్రల గురించే చెప్పేందుకు మాత్రమే శివాజీ రంగంలోకి దిగిపోతున్నాడు.ఈ నేపథ్యంలో శివాజీకి సంబంధించి అమరావతిలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది.

కుట్ర సిద్ధాంతాల పేరుతో టీడీపీకి మైలేజీ తీసుకొస్తున్న శివాజీకి ఎమ్మెల్యే టికెట్ కూడా రాబోతున్నట్టు వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.దీని వెనుక ఓ మీడియా ప్రతినిధి కూడా చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.

గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి శివాజీ పోటీ చేస్తారని ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది.దీనికోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.శివాజీ కూడా తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.సామజిక వర్గం లెక్కల ప్రకారం చూసుకున్నా… గుంటూరు జిల్లా తనకు సేఫ్ అని కాకపోతే ఏ నియోజకవర్గం అయితే తనకు కలిసివస్తుంది అనే లెక్కల్లో ఉన్నాడు.

శివాజీ సొంత నియోజకవర్గం అయిన నర్సారావు పేట మీద కూడా ఆయన దృష్టిపడినట్టు సమాచారం.అయితే టీడీపీ అధినేత ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో … అసలు టికెట్ కేటాయిస్తారా లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube