ఈ రోజు లోక్ సభ లో టీడీపీ ఎంపీలకు చేదు అనుభవం ఎదురయ్యింది.విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు.
సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ అనేకసార్లు కోరినా… వారు మాట వినకపోవడంతో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ వారిని సస్పెండ్ చేశారు.

ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్ గజపతిరాజు, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.







