ఉద్యోగ సమాచారం : గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సోమవారం (డిసెంబరు 31) నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-2 పరిధిలోని మొత్తం 446 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 Appsc Group 2 Notification Relised-TeluguStop.com

వీటిలో 110 పోస్టులు క్యారీఫార్వర్డ్ పోస్టులు కాగా.మిగతా 336 కొత్త పోస్టులు ఉన్నాయి.

సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అభ్యర్థులు జనరవి 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజు మాత్రం జనవరి 30 వరకు చెల్లించాలి.

రెండుదశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.మొదటి దశలో స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష, రెండో దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.

మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.స్క్రీనింగ్ పరీక్షను మాత్రం అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.

అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే ఆఫ్‌లైన్ ద్వారా, దాటకపోతే ఆన్‌లైన్ ద్వారానే పరీక్ష నిర్వహించనున్నారు.

అర్హత:

సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

01.07.2018 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.02.07.1976 – 01.07.1990 మధ్య జన్మించి ఉండాలి.నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250; పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:

స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ద్వారా.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 10.01.2019.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 31.01.2019 ఫీజు చెల్లించడానికి చివరితేది 30.10.2019.స్క్రీనింగ్ పరీక్ష తేది 05.05.2019.మెయిన్ పరీక్ష తేది 18.07.2019, 19.07.2019

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube