కరీంనగర్ లో ఘోరమైన హత్య వెలుగులోకి వచ్చింది.కరీంనగర్ లో బట్టల వ్యాపారి అయిన రాజనర్సును విజయ్‌కుమార్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
వివరల్లోకెళితే.కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్‌లో సెల్ షాపు నడుపుకొనే విజయ్‌కుమార్ కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
రెండు నెలల క్రితం వివాహేతర తో విజయ్ కుమార్ రాసలీలలు సాగిస్తున్న సమయం లో రాజనర్సు చూసాడు.
విజయ్ కుమార్ వివాహేతర సంబంధం గురించి రాజనర్సు, విజయ్ కుమార్ కుటుంబసభ్యులకు తెలిపాడు.
ఆ తరువాత ఆ వివాహిత ను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు రాజనర్సు.కోపం తో రగిలిపోయిన విజయ్ కుమార్, రాజనర్సు ని చంపాలని నిర్ణయించుకున్నాడు.
కానీ రాజనర్సు తనకు కొంత డబ్బు బాకీ ఉండటం తో, ఆ డబ్బును ఈ నెల 18 వ తారీకు లోపు ఇవ్వమని రాజనర్సు కు చెప్పాడు విజయ్ కుమార్.విజయ్ కుమార్ చెప్పినట్టు గానే 18 వ తారీకు రాత్రి విజయ్ కుమార్ కు డబ్బులు ఇచ్చాడు రాజనర్సు.

డబ్బులు ఇచ్చి తిరిగి వెళ్తున్న సమయం లో మద్యం సేవిద్దాం అని రాజనర్సు ని అడిగాడు విజయ్ కుమార్.అందుకు రాజనర్సు సరే అన్నాడు, టూ వీలర్‌పై రాజనర్సును చెరువు కట్ట వరకు తీసుకెళ్లాడు.చెరువు వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్న సమయంలో విజయ్ కుమార్, రాజనర్సు మధ్య వివాహేతర సంబంధం చర్చకు రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, గొడవ తీవ్ర స్థాయి కి చేరుకున్నాక విజయ్ కుమార్, రాజనర్సు తలపై బండరాయితో కొట్టి చంపేశాడు.రాజనర్సు చనిపోయిన స్థలం లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు విజయ్ కుమార్.

రాజనర్సు సెల్ ఫోన్ నుండి చివరిగా కాల్ వెళ్ళింది విజయ్ కుమార్ కె, దీంతో పోలీసులు జరిపిన దర్యాప్తు లో రాజనర్సు ని చంపినట్టు గా అంగీకరించాడు విజయ్ కుమార్.అతి దారుణంగా రాజనర్సు ని చంపేశాడు విజయ్ కుమార్.