వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ – తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య గత కొద్ది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.వర్మ మీద ఏపీ టీడీపీ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించగా…ఇప్పుడు వర్మ ఆ ఎమ్యెల్యేకు లీగల్ నోటీసు పంపించి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసాడు.
నోటీసు అందుకున్న 48గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పి పీఎస్‌లో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో వర్మ పేర్కొన్నారు.అలా చేయకపోతే… చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.
రాంగోపాల్ వర్మను వేధింపులకు గురి చేసేందుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వర్మ లాయర్ అన్నారు.రాంగోపాల్ వర్మ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ”వెన్నుపోటు” పాటను రిలీజ్ చేశారు.ఈ పాట వివాదానికి దారితీసింది.ఇది చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా ఎన్నికల ముందు నాటకం ఆడుతున్నారని అనేకమంది సందేహపడుతున్నారు.
తాజా వార్తలు