ముదిరిన వివాదం : టీడీపీ ఎమ్యెల్యేకు నోటీసులు పంపిన వర్మ

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ - తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య గత కొద్ది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

వర్మ మీద ఏపీ టీడీపీ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించగా.

ఇప్పుడు వర్మ ఆ ఎమ్యెల్యేకు లీగల్ నోటీసు పంపించి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసాడు.

నోటీసు అందుకున్న 48గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పి పీఎస్‌లో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో వర్మ పేర్కొన్నారు.

అలా చేయకపోతే.చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రాంగోపాల్ వర్మను వేధింపులకు గురి చేసేందుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వర్మ లాయర్ అన్నారు.

రాంగోపాల్ వర్మ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ''వెన్నుపోటు'' పాటను రిలీజ్ చేశారు.

ఈ పాట వివాదానికి దారితీసింది.ఇది చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా ఎన్నికల ముందు నాటకం ఆడుతున్నారని అనేకమంది సందేహపడుతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.

Pougues Les Eaux : Bonus Et Promotions Expliqués Pour Les Joueurs Avertis