బాలకృష్ణ నటిస్తున్న ఎన్ఠీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉండగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి రెండోవ భార్య లక్ష్మి పార్వతి జూ.
ఎన్టీఆర్ పైన సంచలనమైన కామెంట్స్ చేసారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…”జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు నందమూరి ఫ్యామిలీ కి దూరంగా ఉంటూన్నాడు.అప్పుడు నేను ఎన్టీఆర్ గారితో ‘ఎంతైనా మీ మనవడని’ చెప్పాను.అప్పుడు రామారావు గారు జూ.ఎన్టీఆర్ ని ఆమె తల్లిని ఇంటికి పిలిపించాడు.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాతో కలిసి ఓ ఫోటోని తీయించుకున్నాడు.
ఆ తరువాత కూడా ఎన్టీఆర్ కి నేను చాలా రకాలుగా సహాయం చేశాను కానీ అవి ఏమి గుర్తుపెట్టుకోలేదు.

ఎన్టీఆర్ గారి ప్రభుత్వం పడిపోయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాతో దిగిన ఫోటోలో నా ఫోటో కట్ చేసి తన తాత తో ఉన్న ఫోటోను మాత్రమే పెట్టుకున్నాడని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు.
అయితే లక్ష్మి పార్వతి గారు చేసిన ఈ కామెంట్స్ పైన జూ.ఎన్టీఆర్ ఫాన్స్ ఆగ్రహం తో ఉన్నారని.ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదని, కావాలనే లేనిపోనివి సృష్టించి జూ.ఎన్టీఆర్ పైన ఆమె అబాండాలు వేస్తున్నారని సోషల్ మీడియా లో జూ.ఎన్టీఆర్ ఫాన్స్ విరుచుకుపడుతున్నారు
.






