ఖమ్మం జిల్లాలో టీడీపీ ఖాళీ కాబోతోందా ...? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు ఎక్కేస్తారా ...?

టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో .మరో ఐదేళ్లపాటు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి కనిపించడంలేదు.

దీంతో ప్రభుత్వంలో తాము ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.అందుకు ఇప్పుడు ఆఫరేషన్ ఆకర్ష్ అనే అస్త్రాన్ని బయటకి తీసి తమ ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేయాలనీ చూస్తోంది.

అదీ కాకుండా ప్రతిపక్షాలకు వచ్చిన కొద్దో గొప్పో సీట్లను కూడా.తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కొత్త ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే, గులాబీ గూటికి కాంగ్రెస్‌ నుంచి వలసలు భారీగా ఉండేలా.టీఆర్‌ఎస్‌ వ్యూహ రచన చేసిందనే వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి.

Advertisement

ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల సభ్యులు మరొక పార్టీలో విలీనానికి మొగ్గు చూపితే, ఆమోదించే సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ కు ఆ హోదా దక్కకుండా చేయాలనీ గులాబీ బాస్ వ్యూహాలు పన్నుతున్నాడు.

ఆ ప్లాన్లు వేస్తూనే.టీఆర్ఎస్ పార్టీకి బద్ద శత్రువుగా మారిపోయిన టీడీపీ ఉనికి తెలంగాణాలో లేకుండా చేయాలనీ చూస్తోంది.వాస్తవంగా మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ రెండంటే రెండు సీట్లను మాత్రమే.

గెలుచుకుంది.అది కూడా ఖమ్మం జిల్లాలో మాత్రమే.

సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య .అశ్వారావు పేటలో మచ్చా నాగేశ్వరరావు లు గెలిచారు.ఇప్పుడు ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడ టీఆర్ఎస్ కారెక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

వీరిద్దరిని ఎలా అయినా.టీఆర్ఎస్ లో చేర్చాలని ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు కంకణం కట్టుకున్నారు.

Advertisement

దీనిలో భాగంగానే కొంతమంది వీరయ్యతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలతో సండ్ర వెంకట వీరయ్య సమావేశమై ఈ విషయమై చర్చించినట్టుగా సమాచారం.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మూడో సారి ఈ స్థానం నుండి విజయం సాధించారు.ఆశ్వరావుపేట నుండి మచ్చా నాగేశ్వర్ రావు తొలిసారి గెలుపొందారు.

అసలు టీడీపీ పేరు చెప్తేనే మండిపడుతున్న టీఆర్ఎస్ అగ్రనాయకులు ఈ సారి ఎలా అయినా టీడీపీకి అసెంబ్లీ లో ప్రతనిధ్యం లేకుండా చేయాలనీ చూస్తోంది.ప్రస్తుతం టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత ఒకరు సండ్ర వెంకట వీరయ్యతో పాటు మచ్చా నాగేశ్వర్ రావుతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం కొద్ది రోజులుగా జోరందుకుంది.

ఇక ఈ విషయంలో ఇదే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా వీరిని కారెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలయితే.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారిపోతేనే బెటర్ అన్న విషయాన్ని లేవనెత్తుతున్నారు.దీంతో పార్టీ మారేందుకు వీరు దాదాపు ఫిక్స్ అయిపోయారు.

కాకపోతే టీడీపీకి మొదటి నుంచి వీర విధేయుడిగా ఉన్న సండ్ర పార్టీ మారుతారనే వార్త నమ్మలేకపొతున్నారు.సండ్ర గులాబీ కండువా వేసుకోవం దాదాపు ఫిక్స్ అయిపొయింది.

కాకపోతే మాచ్ఛా నాగేశ్వరరావు మాత్రం ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

తాజా వార్తలు