టీడీపీ యంగ్ ఎంపీగా పేరు తెచ్చుకున్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ దగ్గర దీక్షకు దిగాడు.ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా….
ప్రధాని నరేంద్ర మోదీ తనకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలంటూ ఆయన దీక్షకు దిగాడు.ఇంతకీ విషయం ఏంటి అంటే… ఈ రోజు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా… రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ ఆవరణలో దీక్ష చేస్తున్న ఆయన విభజన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు.

తన పుట్టినరోజు సందర్భంగా మోడీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యేక హోదానే కావాలన్నారు.ఏపీ చంద్రబాబు నాయుడు తనకు స్ఫూర్తి అని చెప్పిన రామ్మోహన్‌నాయుడు మూడు రాష్టాల్లో బీజేపీ ఓటమి తమ నిరసనల ప్రభావమే అంటూ…చెప్పుకొచ్చారు.రైల్వే జోన్ పై మాట దాటవేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పష్టమైన సమాధానం చెప్పాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.







