బీజేపీ తరపున ‘ఒకే ఒక్కడు’... సీనియర్లంతా తొక్కేసే ప్రయత్నం చేసినా రాజాసింగ్‌ని గెలిపించిన జనాలు, ఎందుకో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది.టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఊహించిందే కాని కాంగ్రెస్‌, బీజేపీలకు ఈస్థాయి పరాభవంను మాత్రం పెద్దగా ఊహించలేదు.

 One Marmy In Telangana Elections From Bjp-TeluguStop.com

రాజకీయ పండితులు సైతం టీఆర్‌ఎస్‌ అధికారం దక్కించుకుంటుందని, బీజేపీ క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.కాని బీజేపీకి ఈ ఎన్నికలు పెద్ద షాక్‌ అని చెప్పుకోవాలి.2014 ఎన్నికల్లో మొదటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అయిదు ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న విషయం తెల్సిందే.అయితే ఈసారి కనీసం పదికి తగ్గకుండా గెలుపొందాని విశ్వ ప్రయత్నాలు చేశారు.

ప్రధాని మోడీ, అమిత్‌షా ఇంకా కేంద్ర మంత్రులు, సినీ నటులు, ప్రముఖులు ఎంతో మంది తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.భారీగా ఖర్చు కూడా చేశారు.కాని కనీసం బీజేపీ సిట్టింగ్‌ స్థానాలను కూడా నిలుపుకోలేక పోయింది.కాని సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మాత్రం ఆధిక్యంను కనబర్చాడు.ఏకంగా 46 వేలకు పైగా మెజార్టీని దక్కించుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.రాష్ట్రంలో బీజేపీ బతికేలా రాజా సింగ్‌ చేశాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రాజా సింగ్‌కు తెలంగాణ బీజేపీ నేతలు సీటు ఇవ్వొదంటూ అడ్డుకున్నారు.కాని ఆయన మాత్రం అధిష్టానం వద్దకు వెళ్లి మరీ సీటును తెచ్చుకున్నాడు.

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఉపాధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఇంకా పలువురు కీలక నేతు అంతా కూడా రాజా సింగ్‌ను దూరం పెట్టే ప్రయత్నాలు చేశారు.ఆయన వల్ల హిందుత్వ ముద్ర బీజేపీపై పడుతుందని ఆరోపించారు.కాని ఆ హిందుత్వ ముద్రనే ఆయన్ను గెలిపించింది.కరుడుగట్టిన హిందుత్వ వాదిగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్‌కు హిందువులు అంతా కూడా మద్దతుగా నిలిచారు.హిందువుల గెలుపుగా దీన్ని అభివర్ణించవచ్చు.

కొన్ని నెలల క్రితం గో రక్షణ నిమిత్తం తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.

తాను చేస్తున్న గోరక్షణ ఉద్యమం వల్ల పార్టీకి ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.హిందువుల కోసం, గో రక్షణ కోసం పార్టీని, పదవిని కూడా వదిలేందుకు రాజా సింగ్‌ సిద్దపడ్డాడు అంటూ జనాల్లో మంచి పేరు వచ్చింది.

ఉత్తరాదికి చెందిన నాయకుల మాదిరిగా హిందుత్వపు వాదిగా పేరు తెచ్చుకోవడం వల్ల రాజా సింగ్‌ బాగా ఫేమస్‌ అయ్యాడు.ముఖ్యంగా యువతలో రాజాసింగ్‌కు అద్బుతమైన ఫాలోయింగ్‌ దక్కింది.

హిందువుల కోసం రాజా సింగ్‌ నియోజకవర్గంలో చాలా పనులు చేశాడు.దేవాలయాల్లో మంచి వసతులతో పాటు ఇంకా హిందూ ధర్మంను కాపాడేందుకు ఆయన పలు కార్యక్రమాలు చేశాడు.ఆ కారణంగానే హిందువులు కళ్లు మూసుకుని ఆయనకు ఓట్లు వేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube