కోడి పందేలు… క్రికెట్ బెట్టింగ్స్ … పొలిటికల్ బెట్టింగ్స్ ఇలా కాదు ఏది అనర్హం అన్నట్టుగా ప్రతి విషయంలోనూ … బెట్టింగులు జోరుగా … హుషారుగా సాగిపోతూ ఉంటాయి.అదో వ్యసనం … ఆ వ్యసనం భారిన పడితే … ఏమి పోగొట్టుకుంటున్నారో… తెలియనంత రేంజ్ లో ఇల్లు గుల్ల చేసుకుంటూ ఉంటారు చాలామంది.
ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వెలివాడిపోయాయి.టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం అయితే దక్కించేసుకుంది.
అయితే తెలంగాణాలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుంది…? ఏ నాయకుడికి ఎంత మెజార్టీ వస్తుంది.? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి .? ఇలా అనేక రకాలుగా పందేలు జరిగిపోయాయి.ఈ బెట్టింగులు ఈ స్థాయిలో జోరందుకోవడానికి పరోక్షంగా సగం కారణం లగడపాటి రాజగోపాల్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణాలో వార్ వన్ సైడ్ కారుకే డిసైడ్ అయ్యింది అంటూ… అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే… లగడపాటి మాత్రం ఆ జాతీయ సంస్థలు ఓటరు నాడి పట్టడంలో విఫలం అయ్యారు.నేను చెబుతున్న తెలంగాణాలో కూటమే అధికారంలోకి వస్తుంది అంటూ ప్రకటించారు.

దీంతో ఆ సర్వేలను నమ్ముకొని గుడ్డిగా పందేలు కాసిన వాళ్లంతా భారీగానే నష్టాలు మూటగట్టుకున్నారు.తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ బెట్టింగులు జోరుగా సాగాయి.వీటివల్ల లాభపడ్డవారి కంటే నష్టం మూటగట్టుకున్నవారే ఎక్కువ గా కనిపిస్తున్నారు.తెలంగాణ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు పందేల హడావుడి పెద్దగా లేదు.కాని పోలింగ్ దగ్గర పడ్డ సమయంలో లగడపాటి సర్వేలు రావడం… అదే సంస్థ నంద్యాల ఉప ఎన్నికతో పాటు మరికొన్ని సందర్భాల్లో నిర్వహించిన సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ప్రజల్లో దానిపై నమ్మకం ఎక్కువ పెట్టుకున్నారు.నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఆ సర్వేను నమ్ముకున్న అనేకమంది లాభపడ్డారు.
దీంతో ఇక్కడ కూడా లగడపాటి ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో పందేలు ఊపందుకున్నాయి.ఆ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మి చాలామంది ప్రజాకూటమి విజయం సాధిస్తుందని పందెం కాశారు.
కూకట్‌పల్లిలో తెలుగుదేశం విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఒకటికి రెండు రెట్లు ఇచ్చేందుకు కొందరు సిద్ధపడ్డారు.

టీఆర్ఎస్ 50 స్థానాలకు మించదని మరికొందరు బెట్టింగ్స్ కాసారు.ఈ విధంగానే… ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటూ… రూ.ఐదు కోట్లు పందెం కాసి ఇందుకు రెట్టింపు అంటే .పది కోట్లు లాభం పొందాడని తెలుస్తోంది.అలాగే… ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని ఓ వ్యక్తి ప్రజాకూటమి విజయం సాధిస్తుంది అనే నమ్మకంతో… 5 ఎకరాలు పందెం కాశాడు.అదే జిల్లా రాజుపల్లి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు కూటమి తరఫున రూ.90 లక్షలు పందెం కాసి చేతులు కాల్చుకున్నారు.ఇక కృష్ణా జిల్లాలో ఎక్కువమంది కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి సుహాసినికి 10 వేల మెజార్టీ మించుతుందని పందెం కాశారు.అంతకంటే తక్కువ వస్తుందని కాని, ఓడిపోతుందని కాని ఎవరైనా పందెం కాస్తే రెండు రెట్లు ఇస్తామని సవాలు విసిరారు.
టీఆర్ఎస్ ఓడిపోతుందని పందెం కాసి గుంటూరు జిల్లాకు చెందిన ఒక రైతు 10 ఎకరాలు పోగొట్టుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇవే కాకుండా తెలంగాణ ,ఏపీలో కోట్లాది రూపాయలు బెట్టింగుల రూపంలో చేతులు మారినట్టు తెలుస్తోంది.
.






