ఎప్పుడూ ఎదుటివారిపై పంచ్ డైలాగులు వేస్తూ.గరం గరంగా కనిపించే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల టెన్షన్లోనూ… సరదా సరదాగా మాట్లాడుతూ అందరిని ఖుషీ చేస్తున్నారు.
తాజాగా కేసీఆర్ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ మాట్లాడుతూ… నాగర్‌కర్నూల్‌కు వస్తుంటే నాకు అద్భుతమైన సంతోషం కలిగింది.కాలువల్లో నీళ్లు చూస్తే గుండె ఉప్పొంగింది.
నాకు బిర్యానీ తిన్నంత సంతోషమైందని’ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో ఇక్కడికి వస్తే నీళ్లు లేని కాలువలు, భూములు కనిపిస్తే చాలా బాధపడ్డానని చెప్పారు.మిత్రుడు దామోదర్‌రెడ్డితో నాగర్‌కర్నూల్ ప్రాంతంలోని కరువుపై చర్చించానని గుర్తు చేసుకున్నారు.కానీ ప్రస్తుతం మర్రి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఇక్కడి కాలువలు నీళ్లతో నిండిపోవడం చూస్తుంటే తన కడుపు నిండిపోయినంత సంబరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.