RTC డ్రైవ‌ర్ ఉద్యోగాన్ని ఊడ‌గొట్టిన కోతి.! వీడియో.!!

వాహనంతో రోడ్డుపైకి ఎక్కితే చాలు.మళ్లీ ఇంటికి సేఫ్‌గా చేరుకుంటామన్న గ్యారంటీ నేటి తరుణంలో లేదు.

అవును మరి, మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి.మనం ఎంత సేఫ్‌గా వెళ్తున్నామని భావించినా.

వెనుక నుంచి, పక్క నుంచి, ముందు నుంచి ఎప్పుడు ఏ వాహనం వచ్చి ఢీకొట్టేది తెలియదు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేడు రోడ్లపై ప్రయాణం చేయాల్సి వస్తోంది.

ఇక ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే.జనాలు జంకుతున్నారు.

Advertisement

ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేశాయి.దీంతో ఆర్‌టీసీలో ప్రయాణించాలంటే ప్రజలు ఒక సారి ఆలోచించిగానీ ఆ నిర్ణయం తీసుకోవడం లేదు.

అయితే కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరగలేదు కానీ.డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు.

కోతి చేతికి స్టీరింగ్ ఇచ్చాడు.దీంతో ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటకలోని కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఓ రూట్‌లో ఓ బస్సు ప్రయాణికులను తీసుకెళ్తోంది.అయితే మార్గమధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ కోతి బస్సు డ్రైవర్ స్టీరింగ్‌పైకి చేరింది.అయితే బస్సు డ్రైవర్ దాన్ని తోలకుండా దాని చేతికి స్టీరింగ్ ఇచ్చి బస్సును నడిపించడం మొదలు పెట్టాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ క్రమంలో ఆ తంతును ఎవరో వీడియో తీసి నెట్‌లో షేర్ చేశారు.ఇంకేముంది.ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.

Advertisement

అది కాస్తా కేఎస్‌ఆర్‌టీసీ అధికారుల దృష్టికి వచ్చింది.-->కోతి బస్సును నడుపుతున్న ఆ వీడియోను చూసిన కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు ఆ బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.అయితే ప్రయాణికులెవరూ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఈ విషయాన్ని తాము సీరియస్‌గానే తీసుకున్నామని ఆ అధికారులు తెలిపారు.ఆ బస్సు డ్రైవర్ చేసిన పనిపట్ల విచారణ చేస్తున్నామని, అతను దోషి అని తేలితే.

అతన్ని ఫీల్డ్ జాబ్ నుంచి తప్పించి డెస్క్ జాబ్‌కు మారుస్తామని వారు తెలిపారు.ఏది ఏమైనా.ఆర్‌టీసీ డ్రైవర్ అన్నలూ.

జర జాగ్రత్త.మీ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి.

కాసింత బస్సు చూసుకుని నడపండి.

తాజా వార్తలు