జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.తన సభలు.
సమావేశాల ద్వారా … పవన్ రాజకీయ వేడి రగిలిస్తున్నారు.ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా… ఆయన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ … తన అన్న చిరంజీవి మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెడతా అంటే అందరూ మద్దతుగా నిలిచారని .అలాగే.తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడతానంటే చాలామంది సపోర్ట్ చేశారని.
కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతా అంటే మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేదు అంటూ… ఆవేదన వ్యక్తం చేశారు.తనకు ఎవరి సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా… నాకు ప్రజలు, ఆడపడుచుల సపోర్ట్ ఉంటుందన్నారు.
ఒక పార్టీని నడపాలంటే తగినంత అనుభవం కావాలని అందుకే గత పదేళ్లుగా రాజకీయాలలో ఉన్నా పోటీ చేయలేదని.అనుభవం దశాబ్దం సరిపోదా అని పవన్ ప్రశ్నించారు.







