హమ్మయ్య ! బరువు దింపారు : స్కూల్ బ్యాగుల బరువుపై కేంద్రం కొత్త ఆదేశాలు !

పసి ప్రాయంలోనే బస్తాల బస్తాల పుస్తకాల బరువు వీపుల మీద మోస్తూ.

వంగి వంగి నడుస్తున్న పిల్లలను మనం చూస్తూనే ఉన్నాం.

అంతంత బరువు ఉన్న బ్యాగులతో.పై అంతస్తుల్లో ఉన్న క్లాస్ రూముల్లోకి ఆ బ్యాగులను మోసుకుంటూ.

వెళ్లడం వల్ల పిల్లల వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు ఇప్పటికే అనేక రిపోర్టులు .విద్యార్థుల తల్లితండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కేంద్రం కనికరం చూపించింది.కొద్ది నెలల క్రితం మద్రాస్ హైకోర్ట్ పిల్లల వీలుపై బస్తాల బరువు తగ్గించాలని.

మొదటి, రెండో తరగతి వరకు పిల్లలకు హోమ్ వర్క్ ఇవ్వరాదని ఆదేశించింది.దీంతో దేశవ్యాప్తంగా మరోసారి పిల్లల స్కూల్ బ్యాగుల బరువు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఇక ప్రతి పాఠశాలలో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను తప్పనిసరి చేయాలని కొత్త సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కింద పనిచేసే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషణ్‌ అండ్‌ లిటరసీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బోధన, స్కూలు బ్యాగుల బరువుపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

తరగతులకు తగ్గట్టు బ్యాగుల భారం ఉండాలని కనిష్టంగా కేజీన్నర గరిష్ఠంగా 5 కేజీలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది.ఒకటి, రెండో తరగతి విద్యార్థుల స్కూలు బ్యాగు బరువు గరిష్ఠంగా 1.5 కిలోలు, 3-5 తరగతి వరకు 2-3 కిలోలు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదో తరగతి విద్యార్థులకు 5 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండరాదని ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది.

ఒకటి, రెండు తరగతులకు హోమ్‌వర్క్‌ ఉండకూడదని స్పష్టం చేసింది.క్లాస్ 1, 2 విద్యార్థులకు భాష, గణితం తప్ప మరేమీ బోధించరాదు.3-5 తరగతుల్లో భాష, ఈవీఎస్, గణితం ఉండాలని చెప్పారు.డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా విద్యార్ధులపై పుస్తకాల భారాన్ని తగ్గించాలని మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్‌ అన్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు