ఎప్పుడూ లేనట్టుగా… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ విషయంలో తెగ బాధపడిపోతున్నాడు.రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు సర్వ సాధారణమే.అయితే… తెలంగాణాలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే… టీడీపీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి ముఖ్యంగా తానే టార్గెట్ చేసుకుని కేసీఆర్ విమర్శలు చేయడం పై ఆయన స్పందించారు.సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి – పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ.

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.తెలుగుజాతిగా కలిసుండాలని నేను కోరుకుంటుంటే.కేసీఆర్ మాత్రం తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని.
ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు.గతంలో తనతోనే ఉన్నారని.
తన అనుచరుడుగా ఉన్నారని.ఇప్పుడు తిడుతూ ఉంటే బాధనిపించదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
తననే తిడుతున్నారని.బాధేస్తోందని అయినా ఫర్వాలేదని బాబు వ్యాఖ్యానించారు.







