వారికి సారీ చెప్పి అందరిని ఆశ్చర్య పర్చిన దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ఈమద్య ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది.ట్యాక్సీవాలా సినిమా ఏమాత్రం బాగోదని అంతా అనుకున్నారు.

 Vijay Devarakonda Sarcastic Slap To Piracy Websites-TeluguStop.com

కాని మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 16 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకుని వామ్మో అనిపించుకుంది.ట్యాక్సీవాలా చిత్రం విడుదలకు రెండు నెలల ముందే లీక్‌ అయిన విషయం తెలిసిందే.

లీక్‌ అయిన సినిమాను ఎవరు చూస్తారు, ఇప్పటికే సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చిందని కొందరు కామెంట్స్‌ చేశారు.దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ్‌ దేవరకొండ పలు సందర్బాల్లో సినిమాను లీక్‌ చేసిన వారికి, లీక్‌ అయిన సినిమా చూసిన వారికి మిడిల్‌ ఫింగర్‌ చూపించి, వారిని దూషించిన విషయం తెల్సిందే.అప్పుడు తన ప్రవర్తనతో సంచలనం సృష్టించి, అలాంటి వారిని అలాగే అనాల్సిందే అనుకున్న ప్రేక్షకులకు మరోసారి విజయ్‌ దేవరకొండ షాక్‌ ఇచ్చాడు.తన సినిమా ముందే లీక్‌ అయ్యిందనే ఆవేదనతో అప్పుడు మిడిల్‌ ఫింగర్‌ చూపి తప్పు చేశానంటూ ఇప్పుడు వారికి క్షమాపణలు చెప్పాడు.పైరసీ చేసిన వారికి క్షమాపణలు చెప్పడం ఏంటీ విజయ్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

విజయ్‌ దేవరకొండ ఏం చేసినా కూడా సంచలనమే అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.విజయ్‌ దేవరకొండ తాజాగా ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే చిత్రంలో నటిసున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు జంటగా ముద్దుగుమ్మ రష్మిక మందన్న నటిస్తోంది.రికార్డు స్థాయిలో అంచనాలున్న ఆ చిత్రంను వచ్చే జూన్‌ లేదా జులైలో విడుదల చేయబోతున్నారు.

ఆ చిత్రంతో విజయ్‌ మరెంత రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube