జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తనది కమ్యూనిస్ట్ సిద్ధాంతం … అంటూ చెప్పుకొస్తున్నాడు.పవన్ ఆ మాట మాట్లాడడం ఏపీలో ఉన్న కమ్యూనిస్టులకు బాగా నచ్చిందో ఏమో కాని ఇక అప్పటి నుంచి జనసేనాని వెంటే సేన లా తిరగడం మొదలుపెట్టారు.
పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడకి వారు వాలిపోయేవారు.పవన్ కూడా వారికి అంతే స్థాయిలో ప్రేయార్టీ ఇచ్చేవారు.
కేవలం పర్యటనల్లోనే కాదు… పవన్ ఆఫీస్ ఇల్లు .ఇలా ఎక్కడ బడితే అక్కడ కమ్యూనిస్ట్ అగ్ర నాయకులూ కనిపించేవారు.అంతే కాదు పవన్ కాబోయే సీఎం అంటూ వారు బహిరంగ ప్రకటనలు కూడా చేస్తూ ఉండేవారు.అయితే ఏమైందో ఏమో కాని కొద్ది కాలంగా వారు జనసేన పార్టీకి దూరం అయ్యారు.

వారు తాము ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళ్ళబోతున్నాము అని ప్రకటించారు.అయితే పవన్ మాత్రం అబ్బే అదేం లేదు జనసేన ఎన్నికలకు ఒంటరిగానే ముందుకు వెళ్తుంది అంటూ… ప్రకటించడంతో కమ్యూనిస్ట్ పార్టీలు హార్ట్ అయ్యారు.అందుకో లేక మరో కారణమో తెలియదు కానీ క్రమంగా జనసేనకు అయితే దూరం అయ్యారు.ఇక పవన్ విషయానికి వస్తే… ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ పర్యటన పూర్తి చేసుకున్నారు.
ప్రజలతో మరింతగా మమేకం అయ్యేందుకు ఆయన రాజమహేంద్రవరం నుండి రంపచోడవరంకు బస్సు యాత్ర చేస్తున్నారు.నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా ఈ బస్సు పర్యటన చేస్తున్నారు.

ఈ ప్రయాణంలో పలు గ్రామాల్లో గిరిజనులతో పవన్ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.ఈ ప్రయాణంలో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు.ఈ బస్సు ప్రయాణంలో ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రజలతో కలిసి ప్రయాణించారు.అయితే ఈ పరిణామం అందరిని ఆశ్చర్యపరిచింది.పవన్ కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళ్తాను అని ఎక్కడా ప్రకటన కూడా చేయలేదు సరికదా వారిని ఎప్పుడు వదిలించుకుందామా అంటూ చూసారు.
అయితే ఇప్పటికిప్పుడు వారు పవన్ పక్కన కూర్చుని బస్సు ఎక్కడం ఏంటి.? మళ్ళీ స్నేహం చిగురించడం వెనుక కారణం ఏంటా అనే ఆలోచనలో అందరూ పడిపోయారు. బహుశా … కమ్యూనిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంటుంది కాబట్టి ఈ పర్యటనలో వారికి ప్రాధాన్యం కల్పించారా .? లేక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారితో కలిసి ఎన్నికల వరకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.







