RRR అప్‌డేట్‌ : ఎన్టీఆర్‌కు అప్పుడు మరదలు ఇప్పుడు చెల్లెలు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం తాజాగా పట్టాలెక్కిన విషయం తెల్సిందే.ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

 Rrr అప్‌డేట్‌ : ఎన్టీఆర్‌కు అప్ప-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది.ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌లు ఇద్దరు పాల్గొంటున్న విషయం తెల్సిందే.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో ఈషా రెబ్బ నటించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.హీరోయిన్స్‌ ఎంపిక ఇంకా పూర్తి చేయని జక్కన్న ఒక కీలక పాత్ర కోసం ఈషాను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

అరవింద సమేత చిత్రంలో ఈషా రెబ్బ నటించిన విషయం తెల్సిందే.హీరోయిన్‌ చెల్లిగా ఈషా కనిపించింది.ఎన్టీఆర్‌కు ఈషా మరదలుగా నటించింది.కాని ఆ సినిమా ఈషాకు పెద్దగా క్రేజ్‌ను తెచ్చి పెట్టలేదు.ఇలాంటి సమయంలో ఆర్‌ మల్టీస్టారర్‌లో ఈషాకు అవకాశం వచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు చెల్లి పాత్రలో ఈషా కనిపించబోతుందని అంటున్నారు.

అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగమ్మాయి అయిన ఈషా తాజాగా వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.చిన్న చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా పెద్ద చిత్రాల్లో చిన్న పాత్రలను చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకుంది.ఇక జక్కన్న మూవీలో ఏ చిన్న పాత్ర ఈమెకు దక్కినా కూడా అద్బుతమే అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

మరి ఈ అమ్మడు ఆర్‌ మల్టీస్టారర్‌లో స్థానం దక్కించుకున్నట్లుగా వస్తున్న వార్తలు నిజమేనా కాదా అనేది జక్కన్న స్పందిస్తే కాని తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube