కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.దాదాపు అందరు అగ్ర హీరోలతో వెండితెరపై మెరిసిన రకుల్ గ్లామర్ షోలో కూడా తన మార్క్ చూపిస్తోంది.
అప్పుడప్పుడూ మాగ్జిన్స్ కవర్ పేజీలకు ఫోజులిస్తూ కుర్రకారు మతిపోగోడుతుంటుంది.ఇది ఇలా ఉంటే…రకుల్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాను ఇప్పటికీ సింగిల్‌గా ఎందుకు ఉన్నానో తెలీడంలేదంది.అబ్బాయిని చూడమని తన స్నేహితులకు చెప్పానని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ…‘యన్‌టిఆర్’ బయోపిక్‌లో అలనాటి తార శ్రీదేవి పాత్రలో నటించడం ఒత్తిడితో కూడుకున్న పని అని తెలుసునని రకుల్ చెప్పింది.సరిగ్గా చేయకపోతే విమర్శలు ఎదురవుతాయని తెలిపింది.ఈ పాత్ర కోసం తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని అంది.శ్రీదేవి పాత్రలో నటించగలనేమో కానీ, ఆమెలా ఎప్పటికీ కాలేనని అంది.తనే కాదు, ఆమెలా ఎవ్వరూ కాలేరని చెప్పుకొచ్చింది.

తనకున్న సినిమా షెడ్యూల్స్‌తో ప్రేమించడానికి సమయం ఎక్కడ దొరుకుతుందని రకుల్ ప్రశ్నించింది.‘నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నా.ఎందుకో నాక్కూడా తెలీడంలేదు.
ఇప్పుడు నాకు ప్రేమ అవసరం ఉందనిపిస్తోంది’ అని రకుల్ చెప్పింది.అంతేకాదు, ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టాలని ముంబై, హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితులకు చెప్పానని కూడా తెలిపింది.
‘ఎప్పుడూ నటన, కెరీర్ అంటూ బిజీగా ఉంటున్నావు.నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? నీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి.అంటూ ఈ మధ్య అమ్మ నన్ను నిలదీసింది.ఇదంతా పెళ్లి కోసమే అని నాకు అర్థమైంది.
సైలెంట్‌గా ఉండిపోయా’ అని రకుల్ చెప్పింది.







