క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చకచకా రూపొందుతోంది.ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు వస్తోన్న ఫస్టులుక్ పోస్టర్స్ అందరిలోను అంచనాలు పెంచేస్తున్నాయి.
ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన అంశాలతో ‘కథానాయకుడు’ .రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలతో ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

జనవరి 9న ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, జనవర్ 25న ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.కానీ ఇప్పుడు ఈ డేట్ లో చిన్న మార్పు జరిగినట్టు సినీ వర్గం ప్రకటించింది.రెండో భాగం ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ డేట్ మారినట్లు తెలుస్తోంది.నిజానికి సినిమాల రిలీజ్ డేట్ల విషయం బాలకృష్ణ దర్శకుడు క్రిష్ నిర్ణయానికే వదిలేసారు.దీంతో క్రిష్ రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల చేయాలని అనుకున్నాడు.కానీ ఇప్పుడు రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదల తేదీ మారినట్లు తెలుస్తోంది.
రెండో భాగాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్ పరిగణలోకి తీసుకుందని సమాచారం.ఈ రెండు పార్ట్‌లకు రెండు వారాలే గ్యాప్ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం.