'నామా' అయితేనే గెలుపు ధీమా ! కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ !

మహాకూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరావు పేరు దాదాపు ఖరారయిపోయింది.

సామాజికంగా, ఆర్ధికంగా, ఏ విధంగా చూసినా నామా నే ఇక్కడ సరైన క్యాండిడేట్ అనే ఒక బలమైన అభిప్రాయానికి కూటమిలోని మెజార్టీ పార్టీలు ఒక అభిప్రాయానికి వచాయి.

అయితే.ఖమ్మం ఎమ్మెల్యేగా నామా నాగేశ్వరరావు పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఎక్కడా నోరు మెదపడంలేదు.

పార్లమెంటుకు పోటీ చేయాలా.? లేక అసెంబ్లీ బరిలో దిగాలా.? అన్న విషయంపై ఖమ్మం పట్టణంలోని ప్రముఖులతోపాటు, ఆయా వర్గాల నేతలతోనూ నామా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయంలో ఆయన ఎటూ ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాడు.

ఇక నామా పోటీలో ఉంటే.ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం నుంచి అధికంగా ఓట్లు పడతాయనే అభిప్రాయం కూటమిలో ఉంది.

Advertisement

పైగా స్థానికంగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.అంతే కాదు అవినీతి ఆరోపణలేమీ లేకపోవడం, ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపడం వంటివన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.

కాకపోతే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలయ్యింది.ఖమ్మం అసెంబ్లీ సీటు వదులుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ఇష్టపడడంలేదు.ఎందుకంటే.

ఈ సీటుపై ఆ పార్టీలో ఆశావహులు కూడా ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ సమాలోచనలో పడినట్లు సమాచారం.జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకరరెడ్డి వంటివారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ పరిణామాలతో.కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు విషయంలో కొత్త తలనొప్పులు తలెత్తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఈ నేపథ్యంలో టిక్కెట్ ను టీడీపీకి ఇచ్చేస్తే.ఈ తలనొప్పులు తప్పుతాయని అధిష్టానం భావిస్తున్నారట.

Advertisement

ఏమైనా ఖమ్మం సీటు నామాకు కనుక దక్కితే టీడీపీ ఖాతాలో ఒక విజయం నమోదయినట్టే.

తాజా వార్తలు