భర్తతో విడిపోయి...మరొకరితో సహజీవనం..! చివరికి ఆ మహిళకి ఏమైందో తెలుస్తే ఆశ్చర్యపోతారు.!

నేటితరుణంలో భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువ అయిపోయాయి…అదేక్రమంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అయిపోయాయి…భర్తతో మనస్పర్థలు వచ్చి…మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది చివరికి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది ఓ మహిళ.ఈ ఘటన రాజమండ్రికి దగ్గరలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళ్తే…

 Woman Commits Suicide Over Illegal Relationship-TeluguStop.com

ఆవ వాంబే కాలనీకి చెందిన ముల్ల కృష్ణకుమారికి పశ్చిమ గోదావరి జిల్లా టేకూరు గ్రామానికి చెందిన యర్రంరెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది.ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.కుమారి ఆ ఊర్లోనే ఉంటూ బీఈడీ చదువుతోంది.ఈ క్రమంలో ప్రసాదరెడ్డి అనే అతనితో కుమారికి పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం సహజీవనంగా మారింది.

కొంతకాలం నుండి నగరంలోని వాంబే కాలనీలో ఒక ఇల్లుకు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

రెండు రోజుల క్రితం ప్రసాదరెడ్డి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.ఫోను చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది.

దీంతో మనస్తాపం చెందిన కుమారి ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగింది.

ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గతంలో ఒక సారి ప్రసాదరెడ్డి ఈ విధంగానే చేయగా బొమ్మూరు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube